![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో....గంగకి ఆ రూమ్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూసేసరికి అందులో లక్ష్మీ ఉంటుంది. తనని చూసిన గంగ షాక్ అవుతుంది. లక్ష్మీ కాళ్ళు చేతులకి ఉన్న తాళ్ళని విప్పేస్తుంది. ఈ పెళ్లి చేసుకోకు వాడు మంచివాడు కాదు.. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.. వాడు దుబాయ్ లో అమ్మేస్తాడంట అని లక్ష్మీ వాడి గురించి చెప్తుంది.
నువ్వు ఇక్కడ నుండి పారిపోమని లేదంటే.. నా మీద ఒట్టే అని లక్ష్మీ అంటుంది. ఏం చెయ్యలేక గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు రుద్రని ఇన్‌స్పెక్టర్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. తన ఫోన్ కూడా లాక్కుంటాడు. అప్పుడే వాంటెడ్ లిస్ట్ లో గంగని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫోటో చూసి షాక్ అవుతాడు. కానిస్టేబుల్ ని పిలిచి రుద్ర వాడి గురించి అడుగగా.. వాడు పెద్ద ఫోర్ ట్వంటి అని చెప్తాడు. వెంటనే ఈ పెళ్లి ఆపాలని ఇన్‌స్పెక్టర్ ని వెళ్లి అడుగుతాడు. నేను పంపించనని అంటాడు. దాంతో కానిస్టేబుల్ పెద్దసారుకి ఫోన్ చేసి రుద్ర అరెస్ట్ గురించి చెప్తాడు. మరొకవైపు పెళ్లి కూతురు లేదని తెలుస్తుంది. వాళ్ళ అమ్మ పంపించందట అని అనుకుంటారు. నీ కూతురితో నాకు పెళ్లి జరగపోతే ఏం చేస్తానో తెలియదని పైడిరాజుకి పెళ్ళికొడుకు వార్నింగ్ ఇస్తాడు. గంగ వెళ్లిపోవడం ఏంటని శకుంతల అంటుంది. ఏదో అబ్బాయి గురించి తెలియకూడని విషయం తెల్సినట్లు ఉంది.. అందుకే వెళ్ళిందని శకుంతల కూతురు అంటుంది.
పైడిరాజు పెళ్లి ఆగిపోయిందని లక్ష్మీని కొడతాడు. నీ కూతురు ఎక్కడున్నా తీసుకొని వచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటానని పెళ్ళికొడుకు అంటాడు. మరొకవైపు గంగ తప్పించుకొని వెళ్తుంది. ఆ తర్వాత పెద్దసారు రుద్రకి బెయిల్ తీసుకొని వస్తాడు. గంగ పెళ్లి ఆపాలి.. అబ్బాయి మంచివాడు కాదని చెప్తాడు. అందరూ అక్కడ నుండి పెళ్లి ఆపడానికి బయల్దేర్తారు. తరువాయి భాగం లో రుద్ర పెద్దసారు పెళ్లి దగ్గరికి వస్తారు. గంగ వెళ్ళిపోయిన విషయం తెలుస్తుంది. ఎలాగైనా గంగని కాపాడాలనుకుంటారు గంగ వీరు కంటపడుతుంది. వీరు తనని తీసుకొని అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |